Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియా వారియర్ వల్లే ఆ సినిమా పరాజయం పాలైంది!: 'ఒరు ఆదార్ లవ్' దర్శకుడు

  • ప్రియా వారియర్ కి క్రేజ్ 
  • ఆమె ఒత్తిడి వల్లనే కథలో మార్పులు
  •  పరాజయానికి ఆమెనే కారకురాలు
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి .. క్రేజ్ వున్నప్పుడే ఒక నాలుగు సినిమాలకి సైన్ చేసేయాలి. లేదంటే ప్రియా వారియర్ కి ఎదురైన పరిస్థితే ఎదురవుతుందనే మాట మలయాళ చిత్రపరిశ్రమలో వినిపిస్తోంది. 'ఒరు ఆదార్ లవ్' సినిమా రిలీజ్ కి ముందు హీరోయిన్ ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. అయినా ఆమె ఈ సినిమా విడుదల తరువాత చూద్దామని చెప్పేసి వాటిని వదిలేసుకుంది.

ఈ సినిమా పరాజయంపాలు కావడంతో, ఇప్పుడు కనుచూపు మేరలో అవకాశం అనేది కనిపించడం లేదట. అంతేకాదు ఈ సినిమా టీమ్ లో ఒక్కొక్కరి నుంచి విమర్శలు అందుకుంటోంది. ప్రియా వారియర్ పై సహనటి నూరిన్ చేసిన విమర్శలు మరిచిపోకముందే, దర్శకుడు ఒమర్ లులూ మరికొన్ని ఆరోపణలు చేశాడు.

 "షూటింగు మధ్యలో ఉండగానే ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దాంతో ఆమె నాకు కనీస గౌరవం కూడా ఇవ్వడం మానేసింది. ఆమె క్రేజ్ మేరకు .. ఆమె ఒత్తిడి మేరకు ఆమెకి ప్రాధాన్యతనిస్తూ కథలో మార్పులు చేర్పులు చేయవలసి వచ్చింది. దాంతో సినిమా పరాజయంపాలైంది. జరిగిన దానికి ఆమే కారకురాలు" అని చెప్పుకొచ్చాడు.
priya varrior

More Telugu News